
కఠ్మాండు : నేపాల్ రాజధాని కఠ్మాండులో ఈ ఉదయం 6.1 తీవ్రతో భూకంపం సంభవించింది. భూ ప్రకంపనలతో వణికిపోయిన జనం భయంతో రోడ్లపైకి వచ్చి పరుగులు తీశారు. భూకంప కేంద్రం ధడింగ్‌లో ఉన్నట్టు నేపాల్ జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన సంస్థ తెలిపింది. ఉదయం 7.39 గంటల సమయంలో భూకంపం సంభవించింది. బాగ్‌మతి, గండకి ప్రావిన్సుల్లోనూ ప్రకంపనలు సంభవించాయి. అయితే, ఈ భూంకంపం కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.