- డిసెంబర్ కల్ల 3 కోట్ల యూజర్లు : ఎరిక్‌సన్ సర్వే వెల్లడి
న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది ముగింపు నాటికి భారత్‌లో 5జి వినియోగదారులు 3.1 కోట్లకు చేరొచ్చని ఎరిక్‌సన్ సర్వేలో వెల్లడయ్యింది. 5జికి డిమాండ్ పెరుగుతోందని పేర్కొంది. ఇతర దేశాలతో పోలిస్తే భారతీయులు రెండు గంటలు ఎక్కువగా 5జి సర్వీస్‌లను ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. ఎరిక్‌సన్ సర్వే ప్రకారం.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 80 లక్షల నుంచి కోటి మంది 5జి వినియోగదారులున్నారని అంచనా వేసింది. ఎక్కువ మంది 5జి డేటాను హై క్వాలిటీ వీడియో స్ట్రీమింగ్, వీడియో కాలింగ్, మొబైల్ గేమ్‌లు ఆడేందుకు ఉపయోగిస్తున్నారు. 15 శాతం మంది యాప్ వినియోగం, వీడియో స్ట్రీమింగ్, గేమింగ్, మ్యూజిక్ వంటి సర్వీస్‌లతో కూడిన 5జి డేటా ప్లాన్లకు ప్రస్తుత ధర కంటే 14 శాతం ఎక్కువ చెల్లించడానికి సిద్దంగా ఉన్నారు. భారత్‌లో గతేడాది అక్టోబర్‌లో పలు ప్రయివేటు టెల్కోలు 5జి సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే.