న్యూఢిల్లీ : బీమా టెక్ కంపెనీ ఇన్సూరెన్స్‌దేకో భారీగా నిధులు సమీకరించింది. సీరిస్ బి ఫండింగ్ రౌండ్‌లో 60 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.500 కోట్లు) నిధులు పొందినట్లు పేర్కొంది. దీంతో ఒక్క ఏడాదిలోనే వరుసగా రెండో సారి విజయవంతంగా ఫండింగ్ లభించిందని పేర్కొంది. ఇప్పటి వరకు మొత్తంగా 200 మిలియన్ డాలర్ల నిధులను అందుకున్నట్లు వెల్లడించింది.