గూర్‌గావ్ : ప్రముఖ టెలికమ్యూనికేషన్స్ సర్వీస్ ప్రొవైడర్ భారతి ఎయిర్‌టెల్ తన వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే 50 లక్షల చెల్లింపు చందాదారుల మైలురాయికి చేరినట్లు తెలిపింది. తమ సంస్థ ఒటిటి కంటెంట్‌ని ఒకే యాప్‌లో సమగ్రంగా అందిస్తోందని పేర్కొంది. 20 కంటెంట్ భాగస్వాములకు సంబంధించి కనీస రీఛార్జ్ రూ. 148తో 40వేల పైగా టైటిల్స్, షోలను చూడవచ్చని పేర్కొంది.