న్యూఢిల్లీ : భారత్‌లో ఇటీవల విడుదల చేసిన గెలాక్సీ జడ్ ఫోల్డ్, జడ్ ఫ్లిప్5 విడుదలతో ప్రీమియం విభాగంలో 50 శాతం మార్కెట్ వాటాను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ ఎంఎక్స్ బిజినెస్ అధ్యక్షుడు, హెడ్ టిఎం రోహ్ తెలిపారు. ఐదు తరాలుగా తమ సంస్థ సేకరించిన జ్ఞానం, అనుభవం ఆధారంగా అత్యంత వినూత్నమైన ఫోల్డబుల్ అనుభవాన్ని అందజేస్తున్నామని అన్నారు. వచ్చే కొన్నేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ఫోల్డేబుల్ ఫోన్లకు ఏడా 10 కోట్ల యూనిట్లకు డిమాండ్ ఉండొచ్చన్నారు.
విలాసవంతమైన మైక్రో ఎల్‌ఇడి ఆవిష్కరణ
సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ కొత్తగా విలాసవంతమైన 110 అంగుళాల పరిమాణంలో మైక్రో ఎల్‌ఇడి విడుదల చేసినట్లు ప్రకటించింది. దీని ధరను రూ.1,14,99,000గా నిర్ణయించింది. భారీ స్క్రీన్ సైజులో లభించే ఈ మైక్రో ఎల్‌ఇడి సంపూర్ణ శోభ, తదుపరిస్థాయి సాంకేతికతకు సూచికగా నిలుస్తుందని ఆ సంస్థ పేర్కొంది. ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో ఇది లభిస్తుందని తెలిపింది.










