Feb 26,2023 13:28

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్‌ (బాపట్ల) : అంబటివారిపాలెంలో 490వ నేత్రదానం దాత అంబటి వీరనారాయణ (92) కుటుంబ సభ్యులు నేత్రదానం చేయడానికి ముందుకు రావడంతో శంకర్‌ నేత్రాలయం గుంటూరు డాక్టర్‌ ఆకాంక్ష రుతుజాలు వచ్చి దాత నేత్రాలను సేకరించారు. కుటుంబ సభ్యులు భార్య వీరమ్మ కుమారులు ప్రతాప్‌ కుమార్‌, అంజమ్మ, నాగేశ్వరరావు, అంజన కుమార్తె పద్మ, అమ్మయ్య, కుటుంబ సభ్యులను రోటరీ క్లబ్‌ ఇంకొల్లుసెంట్రల్‌ అవయవదాన కమిటీ సభ్యులు జెట్టి వెంకటేశ్వర్లు, సోమేపల్లి రామ మోహన్‌ రావు కలిసి నేత్రదానం చేసిన వీరనారాయణ కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను అభినందించారు.