
ఇంటర్నెట్‌డెస్క్ : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సుమారు నాలుగు లక్షల మంది భారతీయ అకౌంట్స్‌ను బంద్ చేసినట్లు తెలుస్తోంది. వినియోగదారుల నుంచి వచ్చి కంప్లైంట్స్‌ను బట్టి ఆ సంస్థ ఈ ఏడాది మార్చి నెలలో 4,715,906మంది వినియోగదారుల అకౌంట్స్‌ను బ్యాన్ చేసినట్లు ఆ సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైంటిస్ట్, టెక్నికల్ విభాగం అందించిన రిపోర్టుల ఆధారంగా అకౌంట్స్ బ్యాన్ చేసినట్లు ఆ కంపెనీ వెల్లడించింది. ఇక వాట్సాప్ నుంచి అసభ్యకర సమాచారం వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఆ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకుంటోంది. రానున్న రోజుల్లో వాట్సాప్ భద్రతకు ఎటువంటి డోకా లేదని కంపెనీ వెల్లడించింది.