
హైదరాబాద్ : ప్రస్తుత దసరా పండగ సీజన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య టికెట్ బుకింగ్‌లలో 40 శాతం పెరుగుదల కన్పించిందని ఆన్‌లైన్ బస్ టికెటింగ్ వేదిక రెడ్‌బస్ తెలిపింది. పరిశ్రమ గణంకాల ప్రకారం.. గడిచిన 14 రోజుల్లో ఈ రద్డీ చోటు చేసుకుందని ఆ సంస్థ గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. హాలిడే సీజన్ సందర్భంగా హైదరాబాదీలు చాలామంది బాపట్ల, మచిలీపట్నం, రామోజీ ఫిల్మ్ సిటీలకు వెళ్తున్నారని పేర్కొంది. మరోవైపు తిరుపతి, శ్రీశైలం, అన్నవరం దేవస్థానాలకు కూడా ఎక్కువగా వెళ్తున్నారని తెలిపింది. పండుగల సమయంలో రోజుకు 3.2 లక్షల మంది ప్రయాణిస్తారని రెడ్‌బస్ సిఇఒ ప్రకాష్ సంగం అంచనా వేశారు.