Aug 08,2023 20:43

న్యూఢిల్లీ : భారత విమానయాన రంగంలోకి ప్రవేశించిన అనాతికాలంలోనే మెరుగైన ప్రగతిని కనబర్చుతున్నట్లు ఆకాశ ఎయిర్‌ తెలిపింది. ఏడాది కాలంలోనే 0 శాతం నుంచి 4.9 శాతానికి మార్కెట్‌ వాటాను పెంచుకున్నట్లు తెలిపింది. కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుండి 84 శాతం కంటే ఎక్కువ ప్రయాణీకుల లోడ్‌ ఫ్యాక్టర్‌ను నమోదు చేసినట్లు వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు అక్యూపెన్సీ 90 శాతానికి చేరినట్లు పేర్కొంది. భారత్‌లో ఈ సంస్థ 2022 ఆగస్ట్‌లో తొలిసారి విమాన కార్యకలాపాలను ప్రారంభించింది.