హైదరాబాద్ : అండమాన్ నికోబార్ దీవుల్లో మరోసారి భూకంపం వచ్చింది. గురువారం తెల్లవారుజామున 4.17 గంటలకు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేలుపై 4.3గా నమోదయిందని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 61 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు సంభవించాయని తెలిపింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. కాగా, గత 24 గంటల్లో అండమాన్ దీవుల్లో భూమి కంపించడం ఇది రెండోసారి. బుధవారం ఉదయం 5.40 గంటలకు 5.0 తీవ్రతతో భూమి కంపించిందని ఎన్‌సీఎస్ వెల్లడించింది.