Sep 16,2023 13:34

కాబూల్‌ : ఆప్ఘనిస్తాన్‌లో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.3గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ (ఎన్‌సిఎస్‌) వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. శనివారం ఉదయం 10.58 గంటల సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్‌లో భూప్రకంపనలు సంభవించినట్లు ఎన్‌సిఎస్‌ ఎక్స్‌లో ట్వీట్‌ చేసింది. భూకంప తీవ్రత 4.3గా నమోదైందని ఎన్‌సిఎస్‌ తెలిపింది. వెడల్పు : 36.63, పొడవు : 71.67, 90 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు ఎన్‌సిఎస్‌ ట్వీట్‌లో పేర్కొంది.
కాగా, సెప్టెంబర్‌ 4వ తేదీన కూడా 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది.