ఖాట్మాండు : నేపాల్‌లో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మంగళవారం ఉదయం 10.13 గంటల సమయంలో నేపాల్ రాజధాని ఖాట్మాండుకి 250 కిలోమీటర్ల దూరంలో భూప్రకంపనలు సంభవించాయని ఎన్‌సిఎస్ ఎక్స్‌లో ట్వీట్ చేసింది. వెడల్పు 28.95, పొడవు 83.26, పది కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని ఎన్‌సిఎస్ ట్వీట్‌లో పేర్కొంది.
కాగా, అండమాన్ సముద్రంలో కూడా మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్రత నమోదైనట్లు ఎన్‌సిఎస్ పేర్కొంది.