
మధురై : చెన్నైలోని మధురై జిల్లాలో సోమవారం ఉదయం కారు.. భారీ వాహనమైన కంటైనర్ ట్రక్కుని ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారని మధురై జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌పి) శివ ప్రసాద్ ధృవీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'కంటైనర్‌ని కారు ఢకొీట్టిన ప్రమాదం సోమవారం ఉదయం మధురై జిల్లాలోని తిరుమంగళం సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.' అని ఆయన అన్నారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని ఎస్‌పి శివప్రసాద్ పేర్కొన్నారు.