
న్యూఢిల్లీ : కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఇలా పొడిగించడం మూడోసారి కావడం గమనార్హం. 1982 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి రాజీవ్ గౌబా గతంలో కేంద్ర హౌంశాఖ కార్యదర్శిగా పనిచేశారు. 2019లో కేబినెట్ కార్యదర్శిగా నియమితులు కాగా.. 2021 ఆగస్టులో తొలిసారి ఆయన పదవీ కాలాన్ని ఏడాది పాటు కేంద్రం పొడిగించింది. ఆ తర్వాత 2022 ఆగస్టులో రెండోసారి పొడిగించడంతో ఆ గడువు ఈ నెలతో ముగిసిపోనుంది.ఈ నేపథ్యంలో ఆగస్టు 30 నుంచి మరో ఏడాది పాటు ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తున్నట్టు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ గురువారం వెల్లడించింది.