Aug 09,2023 21:30

న్యూఢిల్లీ : ఆన్‌లైన్‌ గేమింగ్‌పై ఇటీవల అత్యధికంగా 28 శాతం జిఎస్‌టి విధించడంతో ఆ రంగం ఒత్తిడికి గురి కావడం మొదలయ్యింది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఆన్‌లైన్‌ గేమింగ్‌, ఫాంటసీ స్పోర్ట్స్‌ స్టార్టప్‌ మొబైల్‌ ప్రీమియం లీగ్‌ (ఎంపిఎల్‌)లో ఉద్యోగులను తీసివేస్తున్నట్లు తెలుస్తోంది. సంస్థలో పనిచేస్తున్న వారిలో 350 మంది ఉద్యోగులను ఇంటికి పంపించనున్నారని సమాచారం. ఇది భారత్‌లో పనిచేస్తున్న వారిలో 50 శాతానికి సమానం కావడం గమనార్హం. జిఎస్‌టి కౌన్సిల్‌ తీసుకున్న నిర్ణయంతో పన్ను భారం 350 శాతం నుంచి 400 శాతానికి పెరిగిందని.. ఇంతటి భారాన్ని భరించడం కష్టమని ఎంపిఎల్‌ సహ వ్యవస్థాపకులు సాయి శ్రీనివాస్‌, సుధా మల్హోత్ర ఉద్యోగులకు పంపిన ఇ-మెయిల్‌లో పేర్కొన్నారు.