ముంబయి : అగ్రిటెక్ స్టార్టప్ గ్రోకామ్స్ 3.5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.30 కోట్లు) నిధులు సమీకరించినట్లు వెల్లడించింది. జెఎస్‌డబ్ల్యు వెంచర్స్, అరాలి వెంచర్స్ నేతృత్వంలో ఈ నిధులను పొందినట్లు పేర్కొంది. ఈ నిధులను మాసాల దినుసలలో బి2బి కామర్స్ మోడల్‌ను బోలోపేతం చేసేందుకు ఉపయోగించనున్నట్లు గ్రోకామ్స్ సహ వ్యవస్థాపకుడు, సిఇఒ జార్జ్ కురియస్ తెలిపారు.