- బడ్జెట్‌లో అదనపు నిధుల కేటాయిరపులు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : వచ్చే ఆర్థిక సంవత్సరరలో అదనపు విద్యుత్ ఉత్పత్తికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. నాలుగు సంస్థల ద్వారా 3,340 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేరదుకు ప్రతిపాదిరచారు. అయితే ఇవి ఇప్పటికే నిర్మాణంలో ఉన్నవే కావడం గమనార్హం. వీలైనంత వరకు వచ్చే ఏడాదే వీటిని పూర్తి చేసేరదుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నాలుగు కేంద్రాలకు రానున్న బడ్జెట్‌లో అదనపు నిధులు కేటాయిరచాలని కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. నార్ల తాతారావు థర్మల్ కేంద్రం ద్వారా 800 మెగావాట్లను, పోలవరం జల విద్యుత్ కేంద్రంలోని 12 టర్బయిన్ల ద్వారా 960 మెగావాట్లను, ఎగువ సీలేరు పంప్‌డ్ స్టోరేజ్ కేంద్రం ద్వారా 1350 మెగావాట్లను, దిగువ సీలేరు కేంద్రంలో రెరడు యూనిట్ల ద్వారా 230 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తిని చేసేరదుకు ప్రతిపాదిరచారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న విద్యుత్ ఉత్పాదక కేంద్రాల ద్వారా 5613 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఇరదులో థర్మల్ కేంద్రాల ద్వారా 3410 మెగావాట్లు, జల విద్యుత్ కేంద్రాల ద్వారా 1797 మెగావాట్లు, సౌర విద్యుత్ ద్వారా 405 మెగావాట్లను ఉత్పత్తి చేస్తున్నారు. తాజాగా వీటికి అదనంగా 3340 మెగావాట్లను ఉత్పత్తి చేసేరదుకు ప్రతిపాదిస్తున్నారు. ఇరదులో ఎన్‌టిటిపి కేంద్రానికి రూ.650 కోట్లు కేటాయిరచేరదుకు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు మొదట రూ.7586 కోట్లతో అనుమతిరచగా, ఇప్పుడు ఆ అరచనా రూ.8135 కోట్లకు చేరుకురది. అలాగే దిగువ సీలేరు ప్రాజెక్టుకు రూ.350 కోట్లు, పోలవరం జల విద్యుత్ కేంద్రానికి రూ.1877 కోట్లు కేటాయిరచేరదుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.










