Sep 15,2023 22:10

ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌ విడుదల
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిస) వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌ సత్తా చాటింది. ఐసిసి శుక్రవారం విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌ 116రేటింగ్‌ పాయింట్లతో 2వ ర్యాంక్‌కు ఎగబాకింది. ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న పాకిస్తాన్‌ను ఆసియాకప్‌ సూపర్‌ా4లో టీమిండియా చిత్తుచేయడంతో ర్యాంకింగ్‌ మెరుగైంది. ఇక పాకిస్తాన్‌ జట్టు నిర్ణయాత్మక మ్యాచ్‌లో శ్రీలంక చేతిలోనూ ఓటమితో తాజా ర్యాంకింగ్స్‌లో 3వ స్థానానికి పడిపోయింది. ఇక ఆస్ట్రేలియా జట్టు భారత్‌కంటే రెండు పాయింట్లు ఎక్కువగా ఉన్న దృష్ట్యా టాప్‌ ర్యాంక్‌కు చేరకుంది. దీంతో త్వరలో భారత్‌ వేదికగా జరిగే ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టు టాప్‌ ర్యాంక్‌తో, భారత్‌ 2వ, పాకిస్తాన్‌ 3వ ర్యాంక్‌తో బరిలోకి దిగనున్నాయి. మరోవైపు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు తొలి రెండు వన్డేల్లో ఘన విజయం సాధించి టాప్‌ ర్యాంక్‌కు చేరింది.