Nov 04,2023 21:15

ఢిల్లీ :ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బిఒబి) 2023-24 సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో 28.4 శాతం వృద్థితో రూ.4,253 కోట్ల నికర లాభాలు సాధించింది. బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ)6.5 శాతం పెరిగి రూ.10,831 కోట్లుగా చోటు చేసుకున్నట్లు పేర్కొంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ.1,826 కోట్లుగా ఉన్న వడ్డీయేతర ఆదాయం.. గడిచిన క్యూ2లో ఏకంగా రూ.4,171 కోట్లుగా నమోదయ్యింది. ఏడాదికేడాదితో పోల్చితే బిఒబి స్థూల నిరర్థక ఆస్తులు 5.31 శాతం నుంచి 3.32 శాతానికి దిగివచ్చాయి. నికర నిరర్థక ఆస్తులు 1.16 శాతం నుంచి 0.76 శాతానికి పరిమితమయ్యాయి. మొత్తం డిపాజిట్లు 14.6 శాతం పెరిగి రూ.12.49 లక్షల కోట్లకు చేరాయి.