హైదరాబాద్ : ఐఎస్‌పి, ఐటి, ఐటి అనుబంధ సర్వీసుల కంపెనీ నెట్‌లింక్స్ మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో ఆ సంస్థ నికర లాభాలు 26 రెట్లు లేదా 2,508 శాతం పెరిగి 16.5 మిలియన్ రూపాయలుగా నమోదయ్యాయి. మొత్తం రెవెన్యూ రెట్టింపై 46.6 మిలియన్ రూపాయలుగా చోటు చేసుకుంది. ఏడాదికేడాదితో పోల్చితే ఫైనాన్స్ వ్యయం తగ్గినట్లు పేర్కొంది. రెవెన్యూ పెరగడం, వ్యయం తగ్గడంతో లాభాలు పెరిగినట్లు ఆ సంస్థ వెల్లడించింది.










