Aug 17,2023 21:12

మెర్సిడజ్‌ బెంజ్‌ ఇండియా సిఇఒ వెల్లడి
హైదరాబాద్‌ : వచ్చే మూడేళ్లలో తమ మొత్తం కార్ల అమ్మకాల్లో 25 శాతం విద్యుత్‌ వాహనాల వాటా ఉండొచ్చని మెర్సిడజ్‌ బెంజ్‌ ఇండియా ఎండి, సిఇఒ సంతోష్‌ అయ్యర్‌ తెలిపారు. ప్రస్తుతం విద్యుత్‌ వాహనాల వాటా 4 శాతంగా ఉందన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన కొత్త జిఎల్‌సిని ఆవిష్కరించారు. ఇది పెట్రోల్‌, డీజిల్‌ వర్షన్లలో లభిస్తుందన్నారు. ఎక్స్‌షోరూం వద్ద జిఎల్‌సి 300 ధరను రూ.73.5 లక్షలుగా, జిఎల్‌సి220 డి ధరను రూ.74.5 లక్షలుగా నిర్ణయించామన్నారు. వచ్చే 12-18 మాసాల్లో మరో మూడు, నాలుగు కొత్త ఇవి కార్లను విడుదల చేయనున్నామని తెలిపారు. క్రమంగా ఈ రంగంలో తమ సామర్థ్యాన్ని పెంచనున్నామన్నారు. ఇప్పటికే తమ వినియోగదారులు ఇంటి వద్దనే ఇవి స్టేషన్లను ఏర్పాటు చేసుకున్నారన్నారు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ ఇవిలపై రోడ్‌ ట్యాక్స్‌ను విధిస్తున్నాయని.. వీటిపై మినహాయింపును ఇవ్వాలని ఆయన కోరారు. భారత్‌లో రూ.2,700 కోట్ల పెట్టుబడులు పెడుతున్నామన్నారు.