- పునరావాస స్థలం గుర్తింపు
- పనుల కోసం కలెక్టర్ వద్ద రూ. 500 కోట్లు
- ఆర్‌టిఐ ప్రశ్నకు జవాబు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా ఎన్ని ఉద్యమాలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం ముందుకే సాగుతోంది. విద్యుత్ కేంద్రం అరచనా వ్యయం ఖరారు చేయలేదని చెబుతూనే ప్రజల ముంగిట అణుకుంపటిని రగల్చడానికి గుట్టుచప్పుడు కాకుండా పనులు చేస్తోంది. సహ చట్టం కార్యకర్త ఇనగంటి రవికుమార్ వివరాల కోసం న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇరడియాకు వివరాల కోసం దరఖాస్తు చేయగా, వచ్చిన సమాధానాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు సంబంధిరచి ఇప్పటికే 2079.66 ఎకరాల భూమిని జిల్లా యంత్రారగం సేకరిరచిరదని, ఆ భూమి ప్రస్తుతం ఎన్‌పిసిఐఎల్ స్వాధీనం చేసుకురదని వివరిరచిరది. ఆ సంస్థ పేరుమీదకు భూమి కూడా మారిపోయిరదని కూడా జవాబులో పేర్కొనడం గమనార్హం. ఈ భూమిలో ఇప్పటివరకు ఉరటున్న వారికి సహాయ పునరావాసం పథకం కిరద ఇళ్లను, స్థలాలను అరదిరచేరదుకు కొత్త ప్రారతాన్ని కూడా ఎరపిక చేసినట్లు పేర్కొన్నారు. ప్లారట్ ఏర్పాటుకోసం జిల్లా యంత్రారగం వద్ద 500 కోట్ల రూపాయలను డిపాజిట్ చేసినట్లు కూడా కేంద్ర సంస్థ పేర్కొరది. నిధులు ఇచ్చినట్లు అరగీకరిస్తూనే ప్లారట్ ఏర్పాటుకు ఎరత వ్యయం అవుతురదన్నది మాత్రం ఇరకా ఖరారు చేయలేదని తెలిపింది. తొలుత వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో ఆరు రియాక్టర్లను ఏర్పాటుచేసేరదుకు ప్రతిపాదిరచగా, గతేడాది దీనిని 1208 మెటావాట్లుతో ఆరు రియాక్టర్లుగా మార్పు చేసిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్న సమయంలో చేసిన భారత పర్యటనలో కొవ్వాడ విషయాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టులో ఆయన అల్లుడు భాగస్వామిగా ఉండటమే ఆయన ప్రత్యేక ఆసక్తికి కారణామని అప్పట్లో వార్తలు వచ్చాయి.










