హైదరాబాద్ : ఆంధప్రదేశ్, తెలంగాణలో తమ సంస్థ 20 లక్షల మంది 5జి వినియోగదారుల మైలురాయిని దాటిందని భారతీ ఎయిర్‌టెల్ తెలిపింది. దేశంలో 5జి సేవలు ప్రారంభించిన తొలి 8 నగరాల్లో హైదరాబాద్ ఒక్కటని పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో 150 నగరాలు, పట్టణాల్లో 5జి సేవలను అందుబాటులోకి తెచ్చామని భారతీ ఎయిర్‌టెల్ ఎపి, తెలంగాణ సిఇఒ శివన్ భార్గవా తెలిపారు.










