
ప్రజాశక్తి-రాజంపేటఅర్బన్(అన్నమయ్యజిల్లా) : సుండుపల్లి మండలం గుండ్లపల్లి గ్రామపంచాయతీ కేతిరెడ్డి గారి పల్లెకు చెందిన టిడిపి కార్యకర్తలు సుమారు 20 కుటుంబాల వారు ఆదివారం రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకట మల్లిఖార్జున రెడ్డి సమక్షంలో బోయినపల్లిలోని ఆయన పార్టీ కార్యాలయంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఎమ్మెల్యే మేడా నాయకత్వం నచ్చి వైసీపీ తీర్థం పుచ్చుకున్నట్లు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పవన్ కుమార్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, చెన్నూరు మునయ్య, బాలిపోగు ఆంజనేయులు, చెన్నూరు శ్రీనివాసులు, బాలిపోగు హరి, బాలిపోగు వెంకటేష్, సలవ మల్లిఖార్జున, జంగంపల్లి కొండయ్య తదితరులు పాల్గొన్నారు.