Sep 30,2023 22:14
  • టెన్నిస్‌, స్క్వాష్‌లలో పసిడి

హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో ఏడోరోజు భారత్‌కు మరో రెండు బంగారు పతకాలు దక్కాయి. పురుషుల స్క్వాష్‌ టీమ్‌ విభాగంతోపాటు టెన్నిస్‌ మిక్స్‌డ్‌లో భారత్‌కు స్వర్ణం లభించాయి. పురుషుల స్క్వాష్‌లో మహేశ్‌, సౌరవ్‌ గోషల్‌, అభరుసింగ్‌లతో కూడిన భారత జట్టు నసీర్‌ ఇక్బాల్‌, మహ్మద్‌ ఆసిమ్‌, నూర్‌ జమాన్‌లతో కూడిన పాకిస్తాన్‌ జట్టుపై సంచలన విజయం సాధించింది. అలాగే 10మీ. పిస్టల్‌ మిక్స్‌డ్‌లో భారత్‌కు మరో రజత పతకం దక్కింది. దీంతో 7వ రోజు పోటీలు ముగిసే సరికి భారత్‌ మొత్తం 36 పతకాలతో నాల్గో స్థానంలో కొనసాగుతోంది. ఇందులో 10బంగారు, 13రజత, మరో 13 కాంస్య పతకాలు ఉన్నాయి.

  • అదరగొట్టిన అభయ్...

శనివారం త్కంఠభరితంగా జరిగిన స్క్వాష్‌ ఫైనల్లో భారత్‌ 2ా1తేడాతో పాకిస్తాన్‌ను చిత్తుచేసింది. తొలి గేమ్‌లో మహేశ్‌ 8-11, 3-11, 2-11తో ఇక్బాల్‌ చేతిలో ఓడాడు. దీంతో భారత్‌ 0-1తో పాకిస్తాన్‌కంటే వెనుకబడింది. ఇక రెండో గేమ్‌లో సౌరవ్‌ ఘోషల్‌ 11-5, 11-1, 11-3తో మహ్మద్‌ ఆసీమ్‌పై గెలిచి 1-1తో స్కోర్‌ను సమం చేశాడు. నిర్ణయాత్మక మూడో, చివరి మ్యాచ్‌లో అభయ్ సింగ్‌ పెను సంచలన నమోదు చేశాడు. ఏకంగా రెండు మ్యాచ్‌ పాయింట్‌లను ఎదుర్కొని మరీ ప్రత్యర్థిపై స్వర్ణం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ గేమ్‌లో అభరు 11-7, 9-11, 7-11, 11-9, 1210తో నూర్‌ జమాన్‌కు ఝలక్‌ ఇచ్చాడు. ఉత్కంఠభరితంగా సాగిన తొలి సెట్‌ను నెగ్గిన అభరు.. రెండు, మూడు సెట్‌లలో ఓడాడు. నాల్గో సెట్‌ను 11-9 చెమటోడ్చి నెగ్గిన అభరు.. ఐదో సెట్‌లో 8-10పాయింట్లతో ఓటమి కోరల్లో నిలిచాడు. ఆ దశలో వరుసగా నాలుగు పాయింట్లు సాధించి భారత జట్టు స్వర్ణ పతకం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.

  • టెన్నిస్‌ మిక్స్‌డ్‌లో బపన్న జోడికి కూడా..

టెన్నిస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో బపన్న జోడికి బంగారు పతకాన్ని ముద్దాడింది. బపన్న, రుతుజా భోస్లే జోడీ 2-6, 6-3, 10-4తేడాతో తైపికి చెందిన సుంత్‌ హౌ హువాంగ్‌, ఇన్‌ షౌ లియాంగ్‌ జంటపై గెలుపొందారు. రెండవ సెట్‌లో 27ఏళ్ల భోస్లే విరోచిత ఆటను ప్రదర్శించింది. స్టన్నింగ్‌ రిటర్న్‌ షాట్స్‌తో అదరగొట్టింది. ఆసియా క్రీడల్లో బప్పన్నకు స్వర్ణ పతకం దక్కడం ఇది రెండోసారి.

  • 10మీ. పిస్తోల్‌ మిక్స్‌డ్‌లో రజతం..

10మీ పిస్తోల్‌ మిక్స్‌డ్‌ విభాగంలో దివ్యా టిఎస్‌, సరబ్‌జోత్‌ సింగ్‌ జోడి రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో భారత్‌ 14-16తో చైనా జోడి చేతిలో ఓడింది. షూటింగ్‌లో భారత్‌కు ఇది 19వ పతకం. ఫైనల్లో చైనా షూటర్లు జాంగ్‌ బోవెన్‌, జియాంగ్‌ కాంగ్జిన్‌లు బంగారు పతకాన్ని చేజిక్కించుకున్నారు. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో సరబ్‌జోత్‌ 291పాయింట్లు, దివ్య 286 పాయింట్లతో మొత్తం 577పాయింట్లతో ఫైనల్‌కు చేరారు.  
పురుషుల 10వేల మీటర్ల మారథాన్‌లో భారత్‌కు రజత, కాంస్య పతకాలు దక్కాయి. కార్తీక్‌ కుమార్‌, గుల్వీర్‌ సింగ్‌ ఈ పతకాలను సాధించారు. 10వేల పరుగును కార్తీక్‌ కుమార్‌ 28నిమిషాల 15:38సెకన్లలో, గుల్వీర్‌ సింగ్‌ 28నిమిషాల 17:21సెకన్లలో గమ్యానికి చేరారు. దీంతో అథ్లెటిక్స్‌లో భారత్‌కు లభించిన పతకాల సంఖ్య మూడుకు పెరిగింది. అంతకుముందు షాట్‌పుట్‌లో కిరణ్‌ బలియాన్‌ కాంస్య పతకం నెగ్గిన సంగతి తెలిసిందే.
బ్యాడ్మింటన్‌ పురుషుల జట్టు ఫైనల్‌కు చేరుకోగా.. సెమీఫైనల్లో భారతజట్టు 2-1తో ద.కొరియాపై విజయం సాధించింది. తొలి సింగిల్‌లో హెచ్‌ఎస్‌ ప్రణరు రారు, కిదాంబి శ్రీకాంత్‌ గెలుపొందగా.. డబుల్స్‌లో ఓటమిపాలయ్యారు. ఇక పురుషుల హాకీ జట్టు 4-0తో పాకిస్తాన్‌ను ఓడించి క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లింది. టేబుల్‌ టెన్నిస్‌ మహిళల డబుల్స్‌లో భారత్‌కు పతకం ఖాయమైంది. క్వార్టర్‌ఫైనల్లో భారత మహిళలజట్టు 11-5, 11-5, 5-11, 11-9తో చైనా జంటను చిత్తుచేసింది.