
ప్రజాశక్తి-పీలేరు (అన్నమయ్య) : పీలేరు ఎంజెఆర్ కాలేజ్ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో జరిగిన ప్రాంగణ ఎంపికలో 19 మంది విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. సుధాకర్ రెడ్డి శనివారం తెలిపారు. స్థానిక చిత్తూరు రోడ్డులోని ఎంజెఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో హైదరాబాదుకు చెందిన ''ఫుఉణ్ణల్'' హెచ్ ఆర్ బాల భార్గవ్ ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్వ్యూలో 90 మంది విద్యార్ధులు హాజరయ్యారని అన్నారు. గ్రూప్ డిస్కషన్, ముఖా ముఖి ఇంటర్వ్యూలో 19 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారని, వారు సంవత్సరానికి రూ.2.5 లక్షలు వేతనం అందుకుంటారని ప్లేసెమెంట్ ఆఫీసర్ సందీప్ రెడ్డి తెలియజేశారు. ఎంపికైన విద్యార్థులను కళాశాల చైర్మన్ ఎంపి అవినాష్ కుమార్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. సుధాకర్ రెడ్డి అభినందించారు. రానున్న రోజుల్లో మరిన్ని మల్టీ నేషనల్ లెవెల్ కంపెనీలు కళాశాలలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ లు రెడ్డి ఖాసీం, చంద్ర శేఖర్, మనోహర్, కేశవ్ గుప్తా, మల్లయ్య, వెంకటరమణ, మధులిక, ఆసియా బాను, విద్యార్థులు పాల్గొన్నారు.