ముంబయి : గడిచిన ఆర్థిక సంవత్సరం 2022ా23 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో రిలయన్స్ ఇండిస్ట్రీస్ నికర లాభాలు 19.1 శాతం పెరిగి రూ.19,299 కోట్లకు చేరాయి. ఇదే సమయంలో కంపెనీ రెవెన్యూ 2.1 శాతం పెరిగి రూ.2.16 లక్షల కోట్లుగా చోటు చేసుకుంది. గడిచిన క్యూ4లో రిలయన్స్ జియో నికర లాభాలు 1.7 శాతం పెరిగి రూ.4,716 కోట్లుగా నమోదయ్యింది. గడిచిన ఆరు మాసాల్లో 2300 పైగా నగరాలకు జియో 5జి సేవలను విస్తరించినట్లు తెలిపింది.










