Jul 26,2023 12:14

క్విటో :   ఈక్వెడార్‌లోని జైలులో సాయుధ ఘర్షణల్లో మరణించిన ఖైదీల సంఖ్య 18కి చేరింది. గుయాకిల్‌ నగరం గుయాస్‌ జైలు నెంబర్‌1లో గత శనివారం నుండి సాయుధ ఘర్షణలు నెలకొన్నాయని అటార్నీ జనరల్‌ ఆఫీస్‌ (ఎఫ్‌జిఇ) పేర్కొంది. మరో 11 మంది పోలీసులు గాయపడ్డారని ట్వీటర్‌లో తెలిపింది. జాతీయ పోలీసులు మరియు సాయుధ దళాలు జైలుని అదుపులోకి తీసుకున్న తర్వాత, వారు మృతదేహాలను తొలగించడం ప్రారంభించారని వెల్లడించింది. సాక్ష్యాలను సేకరిస్తున్నారని ఎఫ్‌జిఇ పేర్కొంది. జైలును తమ ఆధీనంలోకి తీసుకునే ఆపరేషన్‌లో మొత్తం 2,700 మంది పోలీసు మరియు సాయుధ దళాల సభ్యులు పాల్గొన్నారని  అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. జాతీయ పోలీసులు, సాయుధ దళాలు పెనిటెన్షియరీ సెంటర్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్నాయని ఈ క్వెడార్‌ అధ్యక్షుడు గిల్లెర్మో లాస్సో ట్విటర్‌లో ప్రకటించారు.