- జైళ్ల శాఖ డిఐజి రవి కిరణ్
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి : రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు భద్రతపై ఆందోళన అవసరం లేదని జైళ్లశాఖ డిఐజి రవి కిరణ్ తెలిపారు. చంద్రబాబు భద్రతపై ఆ పార్టీ నేతలు గత కొన్ని రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం విధితమే. తాజాగా సెంట్రల్ జైలు ఖైదీ ఒకరు డెంగ్యూతో మృతి చెందడంతో అక్కడి పరిస్థితులపై మరింత అనుమానాలకు తావిస్తోంది. చంద్రబాబును జైలులోనే హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందంటూ చంద్రబాబు తనయుడు లోకేష్‌తోపాటు ఆ పార్టీకి చెందిన పలువురు బహిరంగంగానే ఆరోపించడంతో జైళ్లశాఖ డిఐజి రవి కిరణ్ స్పందించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 2,063 మంది ఖైదీలు ఉన్నారని, జైలు లోపల తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. కోర్టు సూచించిన అన్ని సౌకర్యాలను చంద్రబాబుకు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో దోమల నియంత్రణకు ఫాగింగ్ వంటి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.