ప్రజాశక్తి, ఎంవిపి కాలనీ (విశాఖ) : బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల 16, 17, 18 తేదీలలో కాంటెక్ ఎక్స్ పో 2023 పేరుతో గఅహ నిర్మాణానికి అవసరమైన ముడి పదార్థాల ప్రదర్శన నిర్వహిస్తున్నామని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాజీ జాతీయ ఉపాధ్యక్షుడు సిహెచ్.రామకోటయ్య తెలిపారు. మంగళవారం ఉదయం సిరిపురంలోని బిల్డర్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ ఎక్స్ పోకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ఈ నెల 16వ తేదీ ఉదయం 10.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బుడి ముత్యాలనాయుడు, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేతుల మీదుగా ఈ ఎక్స్ పో ప్రారంభమవుతుందని, మూడు రోజులపాటు జరిగే ఈ ఎక్స్ పో ఉదయం 10.30 నుండి సాయంత్రం 7 గంటల వరకు ఎంవిపి కాలనీలోని గాడి రాజు ప్యాలెస్ లో నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. గత మూడేళ్లుగా కరోనా మహమ్మారి వల్ల నిర్మాణ రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయని ఈ మార్పులకు అనుగుణంగా నూతన టెక్నాలజీని బిల్డర్లకు, యజమానులకు పరిచయం చేసే సదుద్దేశంతో పూర్తి సేవ దఅక్పథంతో ఈ ఎక్స్ పో నిర్వహిస్తున్నామని ఈ ఎక్స్ పోలో సుమారు 50 కంపెనీలకు చెందిన ప్రతినిధులు తమ ఉత్పత్తులను ఐరన్, స్టీల్, కాంక్రీట్ ,సిమెంట్, ఇంటీరియర్, ఎలక్ట్రికల్ వంటి గఅహ నిర్మాణ వస్తువులను ప్రదర్శిస్తారని, కాబట్టి ప్రజలంతా ఈ ప్రదర్శనకు విచ్చేసి నిర్మాణరంగంలోని నూతన టెక్నాలజీని తెలుసుకొని తద్వారా నిర్మాణరంగంలో ముందుకు సాగాలని ఆయన కోరారు. ఈ ప్రారంభోత్సవానికి ఎంపి ఎంవివి సత్యనారాయణ, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకఅష్ణ బాబు లు అతిధులుగా హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ ఎక్స్ పో నిపుణుడు మురళి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం సెంటర్ చైర్మన్ కే.వెంకటేశ్వర్లు, మాజీ చైర్మన్ కె.కుమార్ రాజా, కార్యదర్శి ఎం.ఎన్. మూర్తి, కాంట్రాక్టర్ నవనీత్, తదితరులు పాల్గొన్నారు.










