బెంగళూరు : వృద్థి హోమ్ ఫైనాన్స్ రూ.150 కోట్ల నిధులను సమీకరించినట్లు తెలిపింది. రూ.6-8 లక్షల వేతన జీవులు, స్వయం ఉపాధి కలిన వారిని లక్ష్యంగా చేసుకుని గృహ రుణాలు జారీ చేయడానికి, సంస్థ కార్యకలాపాలను విస్తరించడానికి ఈ నిధులను ఉపయోగించనున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల వారిని లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. వెంచర్ కాపిటల్ ఎలివేషన్ సిరీస్‌ాఎ లో ఈ నిధులను పొందినట్లు తెలిపింది. ఈ నిధులతో వ్యాపారాన్ని మరిన్ని ప్రాంతాలకు విస్తరించడం, సాంకేతికతను బలోపేతం చేయడం, రాబోయే శాఖల్లో మౌలిక వసతుల, ఉద్యోగ కల్పన కోసం ఉపయోగించనున్నట్లు వెల్లడించింది.