
- లంకను కూల్చిన జంపా
లక్నో: ఐసిసి వన్డే ప్రపంంచకప్‌లో శ్రీలంక జట్టు మరోసారి నిరాశపరిచింది. ఆస్ట్రేలియాతో సోమవారం జరిగిన పోరులో శ్రీలంక జట్టు స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. టాస్ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టు 43.3ఓవర్లలో 209పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌కు రెండుసార్లు వర్షం ఆటంక పరిచింది. ఇక టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండీస్ తొలిగా బ్యాటింంగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని వమ్ముచేయక శ్రీలంక ఓపెనర్లు నిస్సంక(61), కుశాల్ పెరీరా(78) తొలి వికెట్‌కు 125పరుగులు జతజేశారు. పటిష్టంగా ఉన్న శ్రీలంక... ఆ తర్వాత మిగిలిన 9వికెట్లను 84 పరుగుల తేడాతో కోల్పోయింది. మిడిలార్డర్ లో చరిత్ అసలంక 25 పరుగులు చేయగా, మిగతా వాళ్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. రెగ్యులర్ కెప్టెన్ దసున షనక గాయపడడంతో జట్టు సారథ్య బాధ్యతలు అందుకున్న కుశాల్ మెండిస్ (9) విఫలం కావడం లంక స్కోరుపై ప్రభావం చూపింది. ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించగా, మ్యాచ్ మళ్లీ మొదలైన తర్వాత లంక పతనం మరింత ఊపందుకుంది. ఆడమ్ జంపా 4 వికెట్లతో హడలెత్తించగా... ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ రెండేసి వికెట్లు తీసి శ్రీలంక పతనాన్ని శాసించారు.
స్కోర్‌బోర్డు...
శ్రీలంక ఇన్నింగ్స్: నిస్సంంక (సి)వార్నర్ (బి)కమిన్స్ 61, కుశాల్ పెరీరా (బి)కమిన్స్ 78, కుశాల్ మెండీస్ (సి)వార్నర్ (బి)జంపా 9, సమరవిక్రమ (బి)జంపా 8, అసలంక (సి)లబూషేన్ (బి)మ్యాక్స్‌వెల్ 25, ధనుంజయ (బి)స్టార్క్ 7, వల్లెలగె (రనౌట్) 2, కరుణరత్నే (ఎల్‌బి)జంపా 2, తీక్షణ (ఎల్‌బి)జంపా 0, కుమార (బి)స్టార్క్ 4, మధుశంక (నాటౌట్) 0, అదనం 13. (43.3 ఓవర్లలో ఆలౌట్) 209పరుగులు.
వికెట్ల పతనం: 1/125, 2/157, 3/165, 4/166, 5/178, 6/184, 7/196, 8/199, 9/204, 10/209
బౌలింగ్: స్టార్క్ 10-0-43-2, హేజిల్‌వుడ్ 7-1-36-0, కమిన్స్ 7-0-32-2, మ్యాక్స్‌వెల్ 9.3-0-36-1, జంపా 8-1-36-4, స్టొయినీస్ 2-0-11-0