రమ్యభారతి ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా సోమేపల్లి జాతీయ స్థాయి కథల పోటీ నిర్వహిస్తున్నాం. అత్యుత్తమ కథకు రూ.2500, ఉత్తమ కథకు రూ.1500, మంచి కథకు రూ.1000, ప్రత్యేక బహుమతులు రూ.500 చొప్పున ఇద్దరికి ఇవ్వనున్నాం. రచయితలు పంపే కథలు రాతలో రెండు నుంచి 4 పేజీలలోపు, డిటిపిలో అయితే 2 పేజీలు దాటరాదు. ఒకరు ఎన్ని కథలైనా పంపవచ్చు. హామీపత్రంపై మాత్రమే రచయిత వివరాలు పేర్కొనాలి. కథలను ఫిబ్రవరి 28వ తేదీలోపు రమ్యభారతి, పి.బి.నెం.5, 11-57/1-32, జె.ఆర్.కాంప్లెక్స్, రెండవ అంతస్తు, రజక వీధి, విజయవాడ-520001 (సెల్:9247475975) అనే చిరునామాకు పంపాలి.
- చలపాక ప్రకాష్, సంపాదకుడు, రమ్యభారతి










