Nov 15,2023 16:01

తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు యాత్రికులు వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు చేరుకుంటున్నారు. యాత్రికుల రద్దీతో 23 కంపార్ట్‌మెంట్లు నిండిపోగా టోకెన్లు లేని యాత్రికులకు 14 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. మంగళవారం స్వామివారిని 69,041 మంది యాత్రికులు దర్శించుకోగా 22,415 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. యాత్రికులు సమర్పించుకున్న మొక్కుల ద్వారా హుండీకి రూ. 3.19 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు.తిరుచానూరులో జరుగుతున్న వార్షిక కార్తిక బ్రహ్మౌత్సవాల్లో భాగంగా టీటీడీ మహిళా ఉద్యోగులతో కలిసి జేఈవో సదా భార్గవి శ్రీ పద్మావతి అమ్మవారికి పట్టువస్త్రాలు, సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారుల సతీమణులతో పాటు, ఆలయ సూపరింటెండెంట్‌ వాణి, టీటీడీ మహిళా ఉద్యోగుల ప్రతినిధి హేమలత, ఇతర మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.