ఈనెల 13వ తేదీ ఆదివారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాదులోని ముంతాజ్ కాలేజీలో రొట్టమాకురేవు కవిత్వ అవార్డు సభ జరుగుతుంది. ప్రసేన్ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో కె.శివారెడ్డి, గుంటూరు లక్ష్మీనరసయ్య, వంశీకృష్ణ, కోయి కోటేశ్వరరావు పాల్గొంటారు. ఈ ఏడాది అవార్డులను పసునూరు శ్రీధర్ బాబు, వైష్ణవి శ్రీ, బిల్ల మహేందర్, పల్లిపట్టు నాగరాజులకు ప్రదానం చేస్తారు. పుస్తకావిష్కరణలు, కవితాపఠనం కూడా ఉంటాయి.
- యాకూబ్, శిలాలోలిత










