హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో స్పందన స్పూర్తి ఫైనాన్సీయల్ నికర లాభాలు 127 శాతం పెరిగి రూ.125 కోట్లకు చేరాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.55 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఈ ఎన్‌బిఎఫ్‌సిాఎంఎఫ్‌ఐ గడిచిన క్యూ2లో వ్యాపార విస్తరణ, అధిక రాబడి, బ్యాలెన్ష్ షీట్ల క్లియరెన్స్ మెరుగైన ఆర్థిక ఫలితాలకు దోహదం చేసిందని ఆసస్థం తెలిపింది. ఏడాదిలో 292 కొత్త శాఖలను ఏర్పాటు చేయడంతో మొత్తం శాఖలు 1.407 శాఖలకు చేరాయని.. వచ్చే మూడు నెలల్లో మరో 110 శాఖలను తెరువనున్నట్లు వెల్లడించింది.