
చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న పారా ఆసియా క్రీడల్లో భారత్ అథ్లెట్లు అదరగొట్టేస్తున్నారు. క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య తాజాగా వంద దాటేసింది. ప్రస్తుతం 111 పతకాలతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇందులో 29 బంగారు, 31 రజతాలు, 51 కాంస్య పతకాలు ఉన్నాయి. చివరి రోజైన ఇవాళ తొలి పతకం పురుషుల 400 మీటర్ల విభాగంలో భారత్‌కు దక్కింది. గోల్డ్ మెడల్‌తోనే భారత్ ‘సెంచరీ’ మార్క్‌ను తాకడం విశేషం. కేవలం 49.48 సెకన్లలోనే రేస్‌ను పూర్తి చేసి గవిత్ బంగారు పతకం సాధించాడు
అథ్లెట్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసలు
భారత్ వందను దాటడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘ఎక్స్’ వేదికగా అథ్లెట్లపై ప్రశంసలు కురిపించారు. ‘‘ఆసియా పారా క్రీడల్లో భారత్ 100 పతకాల మార్క్‌ను దాటేసింది. అద్భుతమైన టాలెంట్, కష్టానికి దక్కిన ఫలితమిది. మన అథ్లెట్ల దృఢ సంకల్పంతోనే ఇది సాధ్యమైంది. క్రీడాకారులకు నా అభినందనలు చెబుతున్నా’’ అని పోస్టు చేశారు.