న్యూఢిల్లీ : దేశంలో డిజిటల్ చెల్లింపులు రికార్డ్ స్థాయిలో పెరుగుతున్నాయి. ప్రస్తుత ఏడాది అక్టోబర్‌లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యుపిఐ) లావాదేవీలు 1,141 కోట్లకు చేరాయి. 1000 కోట్ల మార్క్‌ను నమోదు చేయడం చేయడం ఇది మూడో సారి. గడిచిన నెలలో లావాదేవీల విలువ రూ.17.16 లక్షల కోట్లుగా నమోదయ్యిందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషేన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) వెల్లడించింది. ఇంతక్రితం సెప్టెంబరులో 1,056 కోట్లు, ఆగస్టులో 1,024 కోట్లు, జులైలో 996 కోట్ల చొప్పున యుపిఐ లావాదేవీలు చోటు చేసుకున్నాయి.