Sep 25,2023 22:28

ఇండోర్‌: ఇండోర్‌ గ్రౌండ్‌ స్టాఫ్‌కు మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(ఎంపిసిఏ) నజరానా ప్రకటించింది. భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం జరిగిన రెండో వన్డేకు పూర్తయ్యేందుకు అహర్నిశలు శ్రమించిన సిబ్బందికి కష్టానికి వారందరికీ కలిపి రూ.11లక్షలు ప్రైజ్‌మనీ ఇస్తున్నట్లు సోమవారం వెల్లడింది. ఈమేరకు ఎంపిసిఏ అధ్యక్షులు అభిలాష్‌ ఖండేకర్‌ ఓ ప్రకటనలో.. భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్‌కు వర్షం రెండుసార్లు ఆటంకపరిచిందని, ఆ సమయంలో హోల్కర్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ సిబ్బంది వెంటనే స్పందించి కవర్లతో మైదానాన్ని మూసేయడం, ఆ తర్వాత మైదానాన్ని వెంటనే సిద్ధం చేయడంతో జరిగిందని అన్నారు. అలాగే మ్యాచ్‌ సజావుగా వీరంతా ఎంతో కష్టపడ్డారని, వీరి కష్టాన్ని వెలకట్టలేమని, వీరందరికి రూ.11 లక్షల నజరానాను ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక ఇండోర్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా జట్టు 28.2 ఓవర్లలో 217పరుగులకు ఆలౌట్‌ కావడంతో భారత్‌ 99 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.