Nov 10,2023 21:20

హైదరాబాద్‌ : ప్రముఖ ఔషద ఉత్పత్తుల కంపెనీ గ్రాన్యూల్స్‌ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో 102.10 కోట్ల నికర లాభాలు నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికం లాభాలు రూ.145 కోట్లతో పోల్చితే 30 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. క్రితం క్యూ2లో గ్రాన్యూల్స్‌ ఆదాయం 3.4 శాతం పెరిగి రూ.1,189.50 కోట్లుగా నమోదయ్యింది. తమ కంపెనీ ఐటి భద్రతను మెరుగుపర్చుతున్నామని గ్రాన్యూల్స్‌ ఇండియా సిఎండి డాక్టక్‌ కృష్ణ ప్రసాద్‌ చిగురుపాటి పేర్కొన్నారు. గడిచిన త్రైమాసికంలో ఆ కంపెనీ షేర్‌ 19 శాతం మేర పెరిగింది.