న్యూఢిల్లీ : గృహోపకరణాల రంగంలోని హయర్ 2024 చివరి నాటికి రూ.10వేల కోట్ల టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది ముగింపు నాటికి అన్ని గృహోపకరణాలు, వినియోగదారుల ఎలక్ట్రానిక్స్‌లో వన్ స్టాప్ సొల్యూషన్‌గా నిలువాలని నిర్దేశించుకున్నట్లు పేర్కొంది. ఆదాయ ఆర్జనలో 2023లో 40 శాతం, 2024లో 30 శాతం చొప్పున వృద్థిని అంచనా వేస్తున్నామని హయర్ ఇండియా ప్రెసిడెంట్ సతీష్ ఎన్‌ఎస్ పేర్కొన్నారు. నిరంతరం అభివృద్థి చెందుతున్న ఐఒటి, డిజిటల్ అభిరుచులపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నామన్నారు.










