న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద చమురు, గ్యాస్ ఉత్పత్తిదారు అయినా ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఒఎన్‌జిసి) 2023 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.10,015 కోట్ల నికర లాభాలు నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.15,206 కోట్ల లాభాలు సాధించింది. దీంతో పోల్చితే గడిచిన త్రైమాసికం లాభాల్లో 34 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. చమురు ధరల్లో తగ్గుదలనే ఇందుకు కారణమని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో ఒఎన్‌జిసి రెవెన్యూ 10 శాతం తగ్గి రూ.1.63 లక్షలుగా చోటు చేసుకుంది. ఇంతక్రితం ఏడాది ఇదే క్యూ1లో రూ.1.82 లక్షల కోట్ల రెవెన్యూ ప్రకటించింది.










