సర్వీస్ నౌ అధ్యయనం
న్యూఢిల్లీ : కృత్రిమ మేధా (ఎఐ) దూసుకొస్తున్న నేపథ్యంలో దేశంలో 1.62 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగుల్లో అదనపు నైపుణ్యాల పెంపు అవసరమని సర్వీస్ నౌ ఓ అధ్యయనంలో వెల్లడించింది. టెక్ కంపెనీ సర్వీస్‌నౌ, పియర్సన్ సంయుక్తంగా ఈ అధ్యయనం చేపట్టాయి. ఇందులో మెషీన్ లెర్నింగ్‌ని ఉపయోగించి, సాంకేతికత ప్రతి ఉద్యోగాన్ని రూపొందించే పనులను ఎలా మారుస్తుందో అంచనా వేసినట్లు పేర్కొంది. ఎఐ మరో 47 లక్షల కొత్త టెక్ ఉద్యోగాలను సృష్టించనుందని పేర్కొంది. వచ్చే ఐదేళ్లలో తెలంగాణలో 1,73,300 సాంకేతిక, సాంకేతికేతర ఉద్యోగాలు ఆటోమేషన్ ద్వారా అప్‌గ్రేడ్ చెందనున్నాయని అంచనా వేసింది.