పూణె : ప్రయివేటు రంగ సాధారణ బీమా సంస్థ ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్స్యూరెన్స్‌కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్‌టి ఇంటెలిజెన్స్ (డిజిజిఐ) డిమాండ్ నోటీసును జారీ చేసింది. రూ.1,728 కోట్లు విలువ చేసే పన్నులు చెల్లించాల్సి ఉంటుందని జిఎస్‌టి దర్యాప్తు సంస్థ తెలిపింది. 2017 జులై నుంచి 2022 మార్చి మధ్య చేసిన కొన్ని సరఫరాలకు సంబంధించి ఐసిఐసిఐ లాంబార్డ్ పన్నులు చెల్లించలేదని డిజిజిఐ పూణె ప్రాంతీయ కార్యాలయం నోటీసుల్లో పేర్కొంది. తగిన వివరణతో నోటీసులపై స్పందిస్తామని ఐసిఐసిఐ లాంబార్ట్ తెలిపింది.