న్యూఢిల్లీ: దేశంలో దిగ్గజ గ్యాస్ సరఫరా సంస్థ గెయిల్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో రూ.1,412 కోట్ల నికర లాభాలు నమోదు చేసింది. ఇంతక్రితం ఏడాది ఇదే సమయంలోని రూ.2,915 కోట్ల లాభాలతో పోల్చితే.. 52 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. గడిచిన క్యూ1లో సంస్థ రెవెన్యూ రూ.32,227 కోట్లుగా చోటు చేసుకుంది. 2022 జూన్ త్రైమాసికంలో రూ.35,572 కోట్ల రెవెన్యూ ఆర్జించింది.










