హైదరాబాద్ : ప్రముఖ విత్తనాల కంపెనీ కావేరీ సీడ్స్ గడిచిన ఆర్థిక సంవత్సరం (2022-23)లో 9.35 శాతం వృద్థితో రూ.1,000.56 కోట్ల రెవెన్యూను సాధించినట్లు ప్రకటించింది. ఇంతక్రితం ఏడాది రూ.915 కోట్ల ఆదాయం నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.208 కోట్లుగా ఉన్న లాభాలు.. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 27.83 శాతం వృద్థితో రూ.267.94 కోట్లుగా ప్రకటించింది. పత్తి రెవెన్యూలో 2.87 శాతం పెరుగుదలను నమోదు చేసినట్లు తెలిపింది. మంగళవారం బిఎస్‌ఇలో కావేరి సీడ్ షేర్ 2.14 శాతం పెరిగి రూ.524.55 వద్ద ముగిసింది.










