
- పొంచివున్న వర్షం ముప్పు
- మధాహ్నం 2.00గం||ల నుంచి
ధర్మశాల: వన్డే ప్రపంచకప్‌లో ఓటమి ఎరుగుని జట్లు ఏవైనా ఉన్నాయా అంటే అవి ఈ రెండు జట్లే.. ఒకటి ఆతిథ్య భారత్ కాగా.. మరో జట్టు న్యూజిలాండ్. ఈ రెండు జట్లు మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ విజయాలను నమోదు చేసుకొని టాప్ ఉన్నాయి. దాదాపు ఈ రెండు జట్లు సెమీస్‌కు చేరడం ఖాయమే అయినా.. లీగ్‌లో ఏ జట్టు పై చెయ్యి సాధిస్తుందో మరికొద్దిసేపట్లో తేలిపోనుంది. ధర్మశాలలోని హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఆదివారం జరుగనున్న మ్యాచ్‌పైనే అందరూ దృష్టి సారించారు. అయితే ఈ మ్యాచ్‌కు వానగండం పొంచి ఉన్నది. తుఫాను ప్రభావంతో ఆదివారం ఈ మ్యాచ్ సజావుగా సాగడం కష్టమేనని ఇక్కడి వాతావరణశాఖ పేర్కొంది. మధ్యాహ్నం సమయానికి తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఇక 2019 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో కివీస్ జట్టు 18 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించగా.. ఆ ఓటమికి టీమిండియా బదులు తీర్చుకోవాలని చూస్తోంది.