విజయవాడ: గత కొన్ని రోజులుగా కృష్ణా పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణమ్మ జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి భారీగా వరదనీరు వస్తుండటంతో ప్రకాశం బ్యారేజీ అన్నిగేట్లను ఎత్తి దాదాపు లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాయంత్రానికి 1.20లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ సీజన్‌లో ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు నీరు విడదల చేయడం ఇదే తొలిసారి. భారీ వర్షాల కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో విద్యాసంస్థలకు బుధవారం సెలవు ప్రకటించారు.










