Oct 06,2023 22:10

విజయవాడ: చిత్తూరులో జరిగే రాష్ట్రస్థాయి అండర్‌-19 ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో ప్రాతినిధ్యం వహించే జిల్లా జట్టు ఎంపిక శుక్రవారం స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగింది. ఆటగాళ్ల ఎంపికను ఆర్గనైజింగ్‌ సెక్రటరీ వి. రవికాంత పర్యవేక్షించారు. 18మందితో ఆటగాళ్లలో ప్రధాన జట్టును, మరో ఏడుగురిని స్టాండ్‌పై ఎంపిక చేసినట్లు ఆమె ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నారాయణ పిడిజిజెసి ఆకునూరు, సోషల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు కిశోర్‌, శ్రీలక్షి, కోచ్‌ పి. రవికుమార్‌ తదితరులు హాజరై ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలని ఆకాంక్షించారు.