గాయంతో నసీమ్ షా ఔట్..
లాహోర్: వన్డే ప్రపంచకప్‌కు పాకిస్తాన్ క్రికెట్‌బోర్డు(పిసిబి) 15మంది సభ్యులతో కూడిన తమ జట్టు ప్రకటించింది. లాహోర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాకిస్తాన్ చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్-ఉల్-హక్ టోర్నీలో పాల్గోనే సభ్యుల వివరాలను వెల్లడించాడు. ఈ జట్టుకు బాబర్ ఆజం సారథ్యం వహించనున్నాడు. అదేవిధంగా వన్డే ప్రపంచకప్‌కు ఆ జట్టు స్టార్ పేసర్ నసీం షా గాయం కారణంగా దూరమయ్యాడు. అయితే ఆసియాకప్ మధ్యలో వైదొలిగిన స్టార్ పేసర్ హ్యారీస్ రవూఫ్ మాత్రం పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. మరోవైపు ఆసియాకప్‌లో శ్రీలంకతో సూపర్-4 మ్యాచ్‌కు దూరమైన స్టార్ ఓపెనర్ ఇమామ్ ఉల్ కూడా తిరిగి ఎంట్రీ ఇచ్చాడు. ఇక స్పిన్నర్ ఉస్మా మీర్, ఫాస్ట్‌బౌలర్ హసన్ అలీను పాక్ సెలక్టర్లు ఎంపిక చేశారు. గాయపడిన నసీం షా స్ధానంలో హసన్ అలీ సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఇక రిజర్వ్ జాబితాలో మహ్మద్ హ్యారిస్, జమాన్ ఖాన్, అర్బర్ అహ్మద్‌లకు చోటు దక్కింది. పాకిస్తాన్ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 6న హైదరాబాద్ వేదికగా నెదర్లాండ్స్‌తో తలపడనుంది.
వరల్డ్‌కప్‌కు పాకిస్తాన్ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్, అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, ఇఫ్తీకర్ అహ్మద్, ఇమామ్-ఉల్-హక్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మ వసీం జూనియర్, సౌద్ షకీల్, సల్మాన్ అలీ అఘా, షాహీన్ షా ఆఫ్రిది, ఉసామా మీర్.
రిజర్వ్: మహ్మద్ హరీస్, జమాన్ ఖాన్, అబ్రార్ అహ్మద్.










